telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

గణేష్ పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలి: ఏపీ సర్కార్

khairatabad ganesh nimajjanam utsav started

ఏపీలో కరోనా వ్సిజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో గణేష్ పండుగను అందరూ ఇళ్లలోనే జరుపుకోవాలని సర్కార్ కోరింది. బహిరంగ ప్రదేశాలకు బదులుగా ఇంట్లోనే పూజలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే పూజ సామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, దేవాలయాల్లో సైతం మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా కట్టడికి మార్చిలో లాక్‌డౌన్ విధించడంతో పండుగలకు కూడా బ్రేక్ పడింది. దీంతో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని మతాల వారు తమ తమ పండుగులను ఇళ్లలోనే జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే.

Related posts