telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలి: సీఎం జగన్​

jagan

పాఠశాల విద్యా శాఖపై ఈరోజు ఏపీ సీఎం ఆయన సమీక్షించారు. ‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో నాణ్యత గల వస్తువులుండాలని సూచించారు. ఈ కిట్ లో మూడు జతల డ్రెస్సులు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్టు, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు ఉండాలని సీఎం ఆదేశించారు. పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని సూచించారు. పాఠశాలలు తెరిచే నాటికి ఈ కిట్ లు పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు.

నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తి కావాలని జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై కూడా సమీక్షించారు. ‘జగనన్న విద్యా కానుక’ నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీ, గోరుముద్ద, మధ్యాహ్న భోజనంపై యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయనకు తెలిపారు.

Related posts