*కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసం నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు
*ప్రజల సందర్శనార్థం క్యాంపు కార్యాలయంలోనే గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
*ఉ.11.25 గం.కు నెల్లూరు క్యాంపు కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం విషయంలో మార్పు జరిగింది. ఆయన అంత్యక్రియలను నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఆయన అంత్యక్రియలను తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని అనుకున్నారు. ఆ తర్వాత ఉదయగిరిలోని సొంత విద్యా సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్దకు మార్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌతమ్ భౌతిక కాయాన్నిబేగంపేట ఎయిర్‌పోర్ట్ కు తరలించారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఉదయం 11.25కి డైకాస్ రోడ్‌లోని క్యాంప్ కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం చేరుకోనుంది. ఉదయం 11.30 నుంచి ప్రజలు, అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
చివరి సారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు రాత్రికి అమెరికా నుండి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రానున్నారు. హెలికాప్టర్‌లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయంతో తల్లి మణి చమంజరి, సతీమణి శ్రీకీర్తి వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు వెళ్లారు. బుధవారం ఉదయం ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డి అంతక్రియలు జరుగుతాయి.
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి