telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నా వారిజ నేత్రీ!

na varija netri poetry corner

నా మది పలికే
మహోన్నత మంత్రం ప్రేమం-
ప్రేమం లో పరిపూర్ణం నీ రూపం
రూపాల రమ్య మార్గంలో
నీవే నా విలసిత గమ్యం
గమ్యం చేరుకునే తరుణంలో
కరుణ కథామృతం
ఒలికించే గాథలే అనంతం
అనంత జగతి వాకిట సుదీర్ఘ
ప్రయాణంలో నీ కరగ్రహణం నా తోడు-
తోడు లో ఒకే భావం
నిండిన రెండు హృదయాల
సంపూర్ణ సద్భావనా సంగమం-
సంగమంలో ప్రపంచాన్ని జయించే ధైర్యం
ఓ వారిజ నేత్రీ!
ధైర్యాన్నిస్తుంది నీ సౌందర్యం
అణువణువు-
లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది-
లలనామణి!
నీ వలపు పలుకుల నేరుపు-
నీవే నా విరిధనువు-
నీవే నా
ప్రణయ కల్పతరువు

-అంశు మాలి,
టెక్కలి

Related posts