తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో డీలా పడ్డ అధికార అన్నాడిఎంకె..విక్రవండీ, నంగునేరికి జరిగిన ఉప ఎన్నికల్లో పుంజుకుంది. విక్రవండీలో అన్నాడిఎంకె అభ్యర్థి ముతామిజెసెల్వన్ డిఎంకె అభ్యర్థి ఎన్ పుగంజేదిపై 44,924 ఓట్ల ఆధిక్యతంతో గెలుపొందారు. అదేవిధంగా నంగునేరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ మనోహరన్‌పై అన్నాడిఎంకె అభ్యర్థి నారాయణన్ 33,445 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
విక్రవండిలో అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె మధ్య ప్రధాన పోటీ నిలిచింది. అన్నాడిఎంకె తరుపున విల్లుపురం జిల్లా కనారు యూనియన్ శాఖ కార్యదర్శి ముతామిజెసెల్వన్, డిఎంకె ట్రెజరర్ ఎన్.పుగంజేది మధ్య గట్టి పోటీ నెలకొంది. నంగూనేరిలో త్రిముఖ పోటీ నెలకొంది. అన్నాడిఎంకె, డిఎంకె, కాంగ్రెస్ అభ్యర్ధులు బరిలో నిలువగా, అన్నాడిఎంకె అభ్యర్థి గెలిచారు.