telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శ్రీవారి భక్తులకు అలర్ట్‌ : ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు

tirumala guest house

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 1005 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,98,815 కు చేరింది. ఇందులో 8,86,216 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5394 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,205 మంది మృతి చెందారు.  అయితే.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కొత్త రూల్స్‌ని తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం దర్శన సమయానికి 24 గంటల ముందే నడకదారి భక్తులను అనుమతించనున్నారు అధికారులు. అలాగే 1 గంట తరువాతే.. రేపటి రోజు దర్శన టికెట్లు ఉన్న భక్తులను ఘాట్‌ రోడ్డులో అనుమతించనున్నారు. అయితే.. ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భారీగా భక్తులు గుమికూడుతున్నారు. అటు భక్తులను అదుపు చేయలేక చేతులు ఎత్తేస్తోంది విజిలేన్స్ సిబ్బంది. ఇక తిరుమల…టిటిడి తీసుకువస్తున్న కొత్త నిబంధనలతో శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

Related posts