telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనా కష్ట కాలంలో పంత్ పెద్ద మనస్సు…

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. హేమకుంత ఫౌండేషన్ ద్వారా కోవిడ్‌ రోగులకు తాను సాయం అందించనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆక్సిజన్‌ కొరతతో రోజు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా రోగుల కోసం అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లు, బెడ్లు, అవసరమైన మందులు హేమకుంత ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు రిషబ్‌ పంత్‌ పేర్కొన్నాడు. అంతేగాక గ్రామీణ ప్రాంతాలతో పాటు నాన్‌ మెట్రో నగరాల్లో మెడికల్‌ సపోర్ట్‌ అందించనున్న ఆర్గనైజేషన్‌లకు తనకు తోచిన సాయం అందించనున్నట్లు పంత్‌ వివరించాడు. అందరూ తలోచేయి వేస్తే దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఒక సుధీర్ఘ లేఖను పంత్ రాసుకొచ్చాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో నాయకత్వం వహించిన రిషబ్ పంత్‌ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానంలో నిలిచింది. ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమిండియా జట్టులో పంత్‌ చోటు దక్కించుకున్నాడు.

Related posts