telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళా మేలుకో

వనితా ఓ వనితా మేలుకో
ఎదురయ్యే సవాళ్లను కాచుకో
నీ ధైర్యాన్ని ఆయుధంగా మార్చుకో
నిద్దుర లేచినప్పటి నుంచి నీకు సమరమే
నువ్వు వేసే ప్రతి అడుగు నిప్పుల గుండమే
నువ్వు వేసే ప్రతి అడుగు నిప్పుల గుండమే
నువ్వు తొక్కె ప్రతి గుమ్మం మృత్యు ద్వారమే
నయ వంచకుల మాటలతో మోసపోతున్నావు
కామాంధుల చేతుల్లో నలిగిపోతున్నారు
మానవ మృగాల చేతిలో తనువే చాలిస్తున్నావు
నువ్వు వేసే ప్రతి అడుగు మెలకువతో ఉండాలి
చీకటికి ముందే గమ్యం చేరాలి
నీవు నువ్వే రక్షణ కవచంలా మారాలి!
ఈ హింస మీద సమర శంఖాన్ని పూరిద్దాం
మానవ మృగాలను అతి కఠినంగా శిక్షిద్దాం

Related posts