telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం “వైల్డ్‌ డాగ్‌”. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడు.  అయితే.. తాజాగా ట్రైలర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. హైదరాబాద్ గోకుల్ చాట్ లో జరిగిన బాంబు పేలుడు తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హైదరాబాద్ లోనే తిష్టవేసిన టెర్రరిస్టులు, వాళ్ళ ఆచూకి తెలుసుకోవడానికి ప్రయత్నించే ఎన్.ఐ.ఎ. అధికారులు… తన సహనానికి పరీక్ష పెడితే… మరో ఆలోచన లేకుండా టెర్రరిస్టులను కాల్చి చంపేసే ఎసీపీ విజయ్ వర్మ… వీళ్ళతో అత్యంత ఆసక్తికరంగా ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రూపుదిద్దుకుంది. హైదరాబాద్ నుండి కాశ్మీర్ కు కథ వెళ్ళాక అక్కడి యాక్షన్ సన్నివేశాలు మరింత రక్తి కట్టించాయనే చెప్పాలి. నాగార్జునకు జోడీగా దియా మీర్జా నటించగా, సాయామీ ఖేర్ ఓ కీలక పాత్రను పోషించింది.

 

Related posts