telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను అక్రమ సంబంధం పెట్టుకునేవాడిగానే చూస్తున్నారు… హీరో ఆవేదన

EMraan

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి సీరియల్ కిస్సర్‌ అనే ట్యాగ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన సినిమాల్లో కంటెంట్ ఉన్నా లేకపోయినా కిస్సింగ్ సన్నివేశాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. అయితే ఈ ట్యాగ్ తనకు చాలా బాధ కలిగిస్తుందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నేను ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూనే నా కెరీర్‌ను మలుచుకున్నాను. సినిమాల్లో నా పాత్ర ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. ఇలాంటి కాకుండా ఇక నుంచి మంచిని చూపించే పాత్రల్లో నటించాలి. అలాంటి స్క్రిప్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నా. కానీ ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్స్ రానేలేదు. అయితే జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్‌లకు మాత్రం దేశభక్తుల్లా కనిపించే పాత్రలు దక్కుతుంటాయి. అందుకే ప్రజలు వారిని దేశభక్తులు అనుకుంటారు. కానీ నాకు మాత్రం కాపురాలు కూల్చే వ్యక్తిగా కనిపించే పాత్రలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తిగా కనిపించే పాత్రలు దక్కుతూ ఉంటాయి. అందుకే ప్రజలకు నా ముఖం చూడగానే వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు అనుకుంటారు. కానీ నిజానికి నేను చాలా మంది వాడిని. కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మరు” అని తెలిపారు.

Related posts