telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆసుపత్రిలో రహస్య కెమెరాలు… పేషేంట్లతో అసభ్యంగా…

Hospital

మెల్‌బోర్న్‌లో మోనాష్ హౌస్ ప్రైవేట్ హాస్పటిటల్‌లో ఓ నర్సుపై రహస్యంగా కెమెరాలు బిగించింది. ఆస్పత్రిని శుభ్రం చేస్తున్న క్లీనర్లకు రెండు రహస్య కెమెరాలు దొరకడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆస్పత్రి యాజమాన్యం బాధ్యులపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిపై విచారణ చేయడానికి డిటెక్టివ్‌లను నియమించింది. దర్యాప్తులో ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న 52 ఏళ్ల సీన్ ఫారో అనే మహిళను దోషిగా తేల్చారు. రహస్య కెమెరాలతో పేషంట్లపై, తన తోటి ఉద్యోగులపై నిఘా పెట్టింది సదరు నర్సు. పేషంట్లతో ఆమె అసభ్యంగా ప్రవర్తించినట్లు తేల్చారు. అలాగే ఆ కెమెరాల్లో చాలా అసభ్యకర చిత్రాలున్నట్లు గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్పత్రి యాజమాన్యం.. సీన్ ఫారోను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related posts