telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని ఆ జిలాల్లో భారీ వర్షాలు…

huge rains in kerala

ఏపీ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నివర్ తుఫాను కారణంగా ముఖ్యంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. గడచిన 24 గంటల్లో ఏపీలో భారీ వర్షపాతం నమోదైంది.. రాష్ట్రంలోని 177 ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు రికార్డు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. నెల్లూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.. వెంకటగిరి మండలం ఏపీటీఎఫ్‌ కాలనీలో అత్యధికంగా 304 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కడప జిల్లా సంబేపల్లిలో అత్యల్పంగా 64.5 మిల్లీ మీటర్ల వర్షం రికార్డు అయ్యింది. ఇక, నెల్లూరు జిల్లాలోని 09 ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది.. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని 72 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని 96 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. ఏపీలోకి డీప్ డిప్రెషన్‌గా మారి చిత్తూరు జిల్లాలోకి నివర్ తుఫాన్‌ ప్రవేశించినట్టు అధికారులు వెల్లడించారు.. చిత్తూరు, నెల్లూరు, అనంత, కడప జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని.. రానున్న 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు.. 4 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు.. మరో 24 గంటల పాటు నివర్ ప్రభావం ఏపీపై ఉంటుందన్న ఆయన.. పంటలకు నష్టం జరగకుండా వీలైనంత మేర జాగ్రత్తలు  తీసుకోవాలని సూచించారు.

Related posts