telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహిళలపై దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు… చిన్మయి ఫైర్

Chinmayi

మహిళలు చనువిస్తేనే పురుషులు తప్పులు చేస్తున్నారని, అన్నింటికీ పురుషులనే తప్పుపట్టడం సరికాదని వ్యాఖ్యానించి తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజా వివాదం రేకెత్తించారు. `కరిత్తుగలై పదివుసెయ్` సినిమా ఆడియో ఆవిష్కరణ సందర్భంగా మహిళలపై భాగ్యరాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. “మహిళలు గతంలో చాలా సాంప్రదాయబద్ధంగా, కట్టుబాట్లతో ఉండేవారు. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొబైల్ ఫోన్లు వచ్చాక మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారు. మహిళలు చనువిస్తేనే పురుషులు తప్పులు చేస్తున్నారు. అన్నివేళలా పురుషులనేతప్పుబట్టడం సరికాదు. నిజానికి పురుషులు వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది చిన్న విషయంగానే ముగిసిపోతోంది. అదే మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకుంటే కట్టుకున్న భర్తని, కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు” అని భాగ్యరాజా వ్యాఖ్యానించారు. భాగ్యరాజా వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా ట్విటర్ ద్వారా భాగ్యరాజాపై విమర్శలు చేసింది. “మహిళల వైఖరి వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం బాధాకరం. నిజానికి ఇలాంటి వాళ్ల వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారు” అని చిన్మయి ట్వీట్ చేసింది.

Related posts