telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆయన ప్రపంచ యుద్ధం ఆపే పనిలో బిజీ… కేఏ పాల్ పై వర్మ సెటైర్లు

Ram-Gopal-Varma

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు సినిమాలో కేఏ పాల్ పాత్రపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన పాత్రను తప్పుగా చిత్రీకరించడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ విషయమై ఆర్జీవీని ప్రశ్నించగా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. నగరంలో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. కేఏ పాల్‌ను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైందన్నారు. ఆయన ప్రపంచ యుద్ధం ఆపే పనిలో బిజీగా ఉన్నారని.. ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకుంటున్నారని అనుకోవడం లేదన్నారు. ఇదిలా ఉంటే .. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ రివ్యూ, శుక్రవారం విడుదల ఉన్నందున ఆదేశాలు ఇవ్వాలని ఆర్జీవీ లాయర్ హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. సినిమా పూర్తి రివ్యూను గురువారం అందజేయాలని ఆదేశించింది.

Related posts