అక్కినేని కోడలు సమంత కథానాయికగా ఫుల్ స్వింగ్‌లో ఉండగానే మరో సరికొత్త అవతారంలోకి మారబోతోందట. ఒకవైపు నటిస్తూనే నిర్మాతగా సినీ నిర్మాణం కూడా చేపట్టనుందట. ప్రస్తుతం `96` రీమేక్‌లో శర్వానంద్‌కు జోడీగా నటిస్తున్న సమంత త్వరలో నిర్మాణ సంస్థను ప్రారంభించనుందని తెలుస్తోంది. కొత్త ట్యాలెంట్‌కు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సమంత ఈ నిర్ణయం తీసుకుందట. తన బ్యానర్‌పై కొత్త దర్శకులతో చిన్న సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించనుందట. అయితే సమంత బ్యానర్ ఎప్పుడు మొదలవుతుంది, తను నిర్మించబోయే తొలి సినిమా ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి `అన్నపూర్ణ ప్రొడక్షన్స్`, `మనం ఎంటర్‌టైన్‌మెంట్స్` వంటి నిర్మాణ సంస్థలు ఉన్నాయి. సమంత కూడా ఒక బ్యానర్‌ను స్థాపిస్తే ఆ ఫ్యామిలీ నుంచి ఇది మూడో నిర్మాణ సంస్థ అవుతుంది.