నేటి నుండి ప్రపంచ కప్ లో భారత్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సౌథాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తలబడనుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్‌లు జరగ్గా అందులో మూడింట్లో సఫారీలు విజయం సాధించగా.. భారత్ ఒకే మ్యాచ్‌లో గెలిచింది. విరాట్ కోహ్లీ, ధోని, ధావన్, రోహిత్ ఇలా అందరూ కూడా ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే వరుస రెండు మ్యాచ్‌లు ఓడిన సఫారీ జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో అనే చెప్పాలి.
నేడు ప్రపంచ కప్ లో డబల్ ధమాకా.. రెండవ మ్యాచ్‌లో ఓవల్ వేదికగా సాయంత్రం 6 గంటలకు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలబడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో సఫారీలను ఓడించిన బంగ్లా రెట్టింపు ఉత్సాహంతో రంగంలోకి దిగుతోంది. ఇక ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు 4సార్లు తలపడగా.. కివీస్ ఆ నాలుగింట్లోనూ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ షకీబ్ అల్ హాసన్ కెరీర్‌లో 200వ వన్డే కావడం విశేషం.