telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ కేబినేట్.. సంచలన నిర్ణయాలు ఇవే !

cm jagan ycp

ఏపీ కేబినెట్‌ భేటీ సీఎం జగన్‌ అధ్యక్షతన ఇవాళ జరిగిన విషయం విదితమే. కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. ఈ భేటీలో నవరత్నాలు అమలు క్యాలెండర్‌కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే…ఈబీసీ నేస్తం పథకానికి, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 300 చదరపు అడుగుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములపై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. ఎస్‌ఈజెడ్‌ రైతులకు 2180 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని సూచించిన కమిటీ…ఎస్‌ఈజెడ్‌ కమిటీ సూచనను ఆమోదించింది కేబినెట్‌. అంతేకాదు… స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు… ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ తెలిపారు. ముందు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహణ చేపట్టాలని కోరతామని వ్యాఖ్యానించిన సీఎం… కోవిడ్ వాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్ళీ కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం జగన్‌ను అభినందించారు మంత్రులు. పంచాయతీల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 శాతం ఫలితాలు సాధించమన్నారు సీఎం జగన్. అలాగే.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై కేబినెట్ లో చర్చ జరిగింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.

Related posts