ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. బంగారాన్ని కొనడానికి మహిళలు చాలా ఇష్టపడతారు. అయితే.. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పెరిగిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 170 పెరిగి రూ. 48,440 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44,400 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160పైకి ఎగసి రూ. 46,090 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 42,250 పలుకుతోంది. బంగారం బాటలోనే, వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ.71,800 వద్ద కొనసాగుతోంది.
previous post
ఢిల్లీ మెడలు వంచాలంటే ఎంపీ సీట్లు గెలవాలి: కేటీఆర్