మెగాహీరో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రంగరంగ వైభవంగా’. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కేతిక, వైష్ణవ్ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈమెలోడీని శంకర్ మహదేవన్ ఈ పాటను పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
ఈ సినిమాలో చిన్నతనం నుంచి హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ అలా పెరిగి పెద్దయ్యినట్లు వీడియోలో కనిపిస్తోంది. అలాగే వైష్ణవ్ డాక్టర్‌గా కనిపించనున్నట్లు పాట చూస్తే అర్థమవుతోంది. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.