కన్నుగీటి రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె మొదటి చిత్రం “ఒరు ఆడార్ లవ్” గత ఏడాది విడుదలైంది. కానీ ఈ చిత్రం ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం హీరోయిన్‌గా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది ప్రియా. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనలోని మరో కోణాన్ని బయట పెట్టింది. మలయాళంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కోసం పాట పాడింది ప్రియా ప్రకాశ్ వారియర్. నరేశ్ అయ్యర్‌తో కలిసి ప్రియా పాట పాడారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చాలా బాగా పాడావంటూ నెటిజన్స్ ప్రియా ప్రకాశ్‌ను ప్రశంసిస్తున్నారు. “తన తొలి ప్రయత్నానికి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” పోస్ట్ చేసింది ప్రియా. ఇక ప్రియా ప్రకాష్ తెలుగులో నితిన్ కు జోడిగా ఓ సినిమాలో నటిస్తోంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
previous post
సుశాంత్ డ్రగ్స్ కోసం వేధించేవాడు… రియా సంచలన వ్యాఖ్యలు