telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హ్యాపీ బర్త్‌డే క్యూటీ… భార్యకు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్

Allu-Arjun

అల్లు స్నేహారెడ్డి సైతం భర్త అల్లు అర్జున్, స్నేహితురాళ్లు, కజిన్స్ సమక్షంలో తన 35వ పుట్టినరోజును సోమవారం అర్ధరాత్రి జరుపుకున్నారు. “నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివైన నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నీతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో, మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే క్యూటీ” అని బన్నీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు తన భార్య కేక్ కట్ చేస్తున్న ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు స్నేహారెడ్డి కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటోలు షేర్ చేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. స్నేహాను బన్నీ తొలిచూపులోనే ప్రేమించారు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి 2011లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు.

Related posts