telugu navyamedia
రాజకీయ

పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మేనళ్లుడు అరెస్ట్..

*పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు హానీ సింగ్​ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు

* శుక్రవారం తెల్లవారుజామున హానీ సింగ్​ను అదుపులోకి తీసుకున్న ఈడీ

* ఈడీ అదుపులో హనీ సింగ్

*అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనళ్లుడు భూపిందర్ సింగ్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ అధికారులు అరెస్ట్​ చేశారు. మరో రెండు వారాల్లో పంజాబ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈ అరెస్టు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో గురువారం భూపిందర్‌ను విచారించిన ఈడీ.. శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.

భూపిందర్‌ సింగ్‌ హనీ పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడం వల్ల ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

జనవరి 18న ఆయనకు చెందిన పలు ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది ఈడీ. రూ.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.ఈ సోదాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు, మొబైల్ ఫోన్లు, రూ. 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. .

మ‌రోవైపు.. 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీకి కొన్ని రోజుల ముందు ఈ అరెస్టు జ‌ర‌గ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీకి ఒకే ద‌శ‌లో ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Related posts