telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ ప్రధాని తీవ్రవాదాన్ని తుదముట్టించి .. శాంతి పాట పడితే బాగుంటుంది.. : భారత విదేశాంగ శాఖ

pak agreed to discuss on kartharpur issue

పాక్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద నిర్మూలపై మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ స్పష్టంగా మరోసారి చెప్పారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ఆయన కోరారు. ఇందుకోసం చిత్తశుద్దితో పని చేసినప్పుడే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.భారత దేశం మాత్రం, పాక్ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పడం హృదయపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగా చూడడం లేదని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మొదటి సారి పాక్ లో ఉగ్రవాదులతో పాటు వారి స్థావరాలు కూడ ఉన్నట్టు ఉన్నట్టు ఒప్పుకున్నారని, అయితే పాక్ లో ఉన్న ఉగ్రవాదులను పూర్తిగా నిరోధించాలని అన్నారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మొదటి సారి కాదని, ఇలాంటీ వ్యాఖ్యలు పాక్ చాలసార్లే చేసిందని తెలిపారు. పాక్ ప్రధానిగా ఎన్నికైన పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ మొదటిసారి అమేరికాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను మట్టుపట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అమేరికాకు వివరించాడు. ఈనేపథ్యంలోనే మొదటిసారిగా 40000 వేల మంది ఉగ్రవాదులు దేశంలో ఉన్నారని స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. ఈనేపథ్యంలో ఉగ్రవాద నిర్మూలను చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని తెలిపారు.

Related posts