telugu navyamedia
తెలంగాణ వార్తలు

అసదుద్దీన్‌ ఒవైసీకి జ‌డ్ కేట‌గిరి సెక్యూరిటీ..

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఢిల్లీకి వెళ్లున్న సమయంలో అసదుద్దీన్ కారుపై జ‌రిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.

24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. ఆరుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమెండోలు, పోలీసులతో సహా 22మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఎస్కార్టు కారుతోపాటు ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పిఎఫ్ సిబ్బంది రక్షణగా ఉంటారు. 

Z Category Security To MP Owaisi: ఎంపీ ఒవైసీకి జెడ్‌ ప్లస్ కేటగిరీ భద్రత  కల్పించిన కేంద్రం | Centre Provides Z Category Security To AIMIM MP Owaisi

అలాగే..ఒవైసీ పై కాల్పులు జ‌రిపిన దుండ‌గుల‌పై అదుపులోకి తీసుకున్నట్లు ఏడీజీ ప్రశాంత్​ కుమార్ తెలిపారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఒవైసీపై కాల్పులు జరిపినట్లు విచారణలో చెప్పారన్నారు. నిందితుల వద్ద పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మొత్తం ఐదు బృందాలు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని , నిందులిద్దరిని కోర్టులో హాజరు పరుస్తామ‌ని ఏడీజీ ప్రశాంత్​ కుమార్​ వెల్ల‌డించారు.

మ‌రోవైపు…ఒవైసీపై నిందితులు కాల్పులు జరిపిన దృశ్యాలు.. సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Related posts