ఏపీ ప్రభుత్వంపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కాదు… ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రజల పట్ల ప్రేమ లేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారని ఫైర్ అయ్యారు. ప్రతి నిమిషానికి ఒక ప్రాణం పోతుందని.. వారి ఆర్తనాదాలు సీఎం జగన్ కు వినిపించడం లేదా? అని నిలదీశారు. మంత్రి వర్గ సమావేశం పెట్టి 33వ అంశంగా ఈ కరోనా అంశాన్ని పెట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు…ఈ సమయంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి..కానీ ప్రతి పక్షంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి అధినేత పై తప్పుడు కేసులు పెడుతున్నారు… ఈ సమయంలో విలువైన సలహాలు ఇస్తుంటే దారుణ విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు.. కరోనా కంటే ప్రమాద కరమైన వ్యక్తి అని విమర్శ చేస్తారా.. విమర్శలు చేసే వారి పేరులోనే వైరస్ ఉంది..వైఎస్ కాదు వైరస్ అని జగన్ పై ఫైర్ అయ్యారు. ప్రజలు బ్రతికి ఉంటే పథకాలు కావాలి..ప్రజల ప్రాణాలు పోతుంటే ఎవ్వరికీ ఇస్తారు…పథకాలు అంటూ ఎద్దవా చేశారు. సీఎం జగన్ తో సహా మంత్రులు అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు.
previous post