telugu navyamedia
సినిమా వార్తలు

“దొరసాని” మూవీ ఫస్ట్ లుక్

Dorasani

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “దొర‌సాని”. తెలంగాణ నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కిస్తున్నారు. సురేష్‌ బాబు సమర్పణలో పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ యష్ రంగినేని – మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ లో ఇద్దరు కూడా ఆకర్షించే హావభావాలతో కనిపిస్తున్నారు. దొరసాని పాత్రలో శివాత్మిక నటించగా సాధారణ యువకుడిగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. దొరసాని కోసం సామాన్యుడైన హీరో తన మొండిపెట్టుతో అలనాటి పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా కథాంశం. జూన్ 6న సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

Related posts