telugu navyamedia
సినిమా వార్తలు

“అఆ” ఇంట్లో “భీష్మ” షూటింగ్… గుర్తుకొస్తున్నాయి అంటున్న నితిన్

Nithin

“శ్రీనివాస కళ్యాణం” సినిమా పరాజయం పాలవ్వడంతో తర్వాత హీరో నితిన్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన “అ..ఆ” షూటింగ్ జరిగిన ఇంట్లోనే భీష్మ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ ఇంట్లో తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఓ ఫన్నీ వీడియోని నితిన్ షేర్ చేశాడు. “నేను గతంలోకి వెళ్తున్నాను.. ఇక్కడ నాకు ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. “అ..ఆ” ఓ అద్భుతమైన ప్రయాణం. అదే ఇంట్లో భీష్మ షూటింగ్ జరుగుతోంది. త్రివిక్రమ్ గారు.. మిస్‌ యూ” అంటూ నితిన్ పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోపై “అ..ఆ”లో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. ఓ స్మైలీతో ఈ వీడియోపై అనుపమ కామెంట్ చేసింది. అనుపమ కామెంట్‌కి “నాగవల్లీ” అంటూ నితిన్ రిప్లే ఇచ్చాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై “భీష్మ” సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Related posts