telugu navyamedia
సినిమా వార్తలు

మళ్లీ చివురించటానికి…

virikanne bhama poetry corner

నయనాల చాటున దాగిన …
పురివిప్పిన నెమలి లా…..
నర్తించే మనోవాంచ్చలెన్నో కదా !
పెదాల పదాల మాటున దాగిన స్వరాల్లో…
వినిపించని గుండె సవ్వడులేన్నో కదా !
మనస్సు పొరల్లో ప్రేమ జ్ఞాపకాల అలజడు ల్లో…
ఎగసిపడే ఆలోచనల అలలు ఎన్నో కదా !
హృదయం గాయపడి కన్నీటి ఆశ్రువులు …
జాలు వారే వేళ గొంతు తడారిపోయి ….
పలుకలేని భావాలెన్నో కదా !
ప్రతి రాక ఎదురు చూపులో …..
నిరాశా ఎదురైనపుడు హృదయం…
ఎండిపోయిన ఆకులా  రాలిపోవటమే…. 
మళ్లీ ఆశ తో చివురించటానికి కదా !

-జె.పద్మావతి, ఆదోని

Related posts