telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నువ్వెప్పటికీ నాకిష్టమైన బేబీవే.. .: అల్లు అర్జున్

AA

లాక్ డౌన్ కారణంగా సామాన్యులతో సహా సెలెబ్రిటీలు సైతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తన తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. “నువ్వు ఇలాంటి బర్త్‌డేలు మరెన్నో జరుపుకోవాలి సిరి.. ఈ ప్రపంచంలో నువ్వెప్పటికీ నాకిష్టమైన బేబీవే” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. శిరీష్ బర్త్‌డే పార్టీని అల్లు ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసింది. తన తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలు, వదినల సమక్షంలో శిరీష్ కేక్ కట్ చేశాడు. కాగా, ఓ తమిళ సినిమా తెలుగు రీమేక్‌లో శిరీష్ కథానాయకుడిగా నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట.

Related posts