telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొంద‌రు చ‌ట్టాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు… లైంగిక వేధింపుల ఆరోపణలపై న‌వాజుద్దీన్ సోదరుడు

Nawaz

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఫ్యామిలీ కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ముందుగా న‌వాజుద్దీన్‌పై ఆయన భార్య ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌గా, రీసెంట్‌గా ఆయ‌న‌ తమ్ముడు… కూతురు వ‌రుస అయ్యే జ‌మీనాని లైంగికంగా వేధించాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే జ‌మీనా తాజాగా ఢిల్లీ పోలీసుల‌కి న‌వాజుద్దీన్ తమ్ముడిపై ఫిర్యాదు చేసింది. 9 ఏళ్ళ వ‌య‌స్సులో చిన్నాన్న‌ న‌న్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు నాకు అవి అర్ధం కాలేదు. పెద్ద‌య్యాక అతడి గురించి తెలుసుకున్నాను. పెళ్లి త‌ర్వాత కూడా వేధించాడు. అత్తింటి వారిపై కూడా త‌ప్పులు కేసులు పెట్టి హింసించేవారు. పెద్ద‌నాన్న (న‌వాజుద్దీన్‌)కి ఈ విష‌యం చెప్ప‌గా.. ‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారు. ఈ విష‌యంలో నాకు ఎవ‌రు అండ‌గా ఉండలేదు అని జ‌మీనా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో న‌వాజుద్దీన్ త‌మ్మ‌డు ష‌మాస్ సిద్ధిఖీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. “కొంద‌రు చ‌ట్టాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. రెండేళ్ళ క్రితం ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పేరు లేదు. కాని ఢిల్లీ పోలీసుల‌కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కొత్త‌గా చేర్చారు. ఈ అస‌త్య ప్ర‌చారాల‌ని మీడియాలో ప్రచారం చేయడం వెనుక ఓ వ్యక్తి ఉంద‌నే విష‌యాన్ని స్పష్టంగా సూచిస్తుంది. సత్యం త్వరలో బయటపడుతుంది” అని ష‌మాస్ పేర్కొన్నారు.

Related posts