టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్రవేశించి దశాబ్దం కావొస్తున్నా ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ అవకాశాలు అందుకుంటోంది. రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందాల శరీరాన్ని విల్లులా వంచి అదరగొట్టెస్తోంది. మొత్తం శరీరాన్ని విల్లులా చేసి.. యోగా విన్యాసాలతో ప్రశంసలు అందుకుంటోంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు.. వావ్ రకుల్.. అంటూ రకుల్ చేసిన యోగా విన్యాసాలను చూసి ఆశ్చర్చంతో కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే రకుల్ ఫిట్నెస్ బిజినెస్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ భామ సినీ కెరీర్ ప్రస్తుతం కొంత స్లోగా వున్న తన బిజినెస్‌లో మాత్రం అదరగొడుతోంది.
previous post