విభిన్నమైన కాన్సెప్ట్‌తో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం “ఏ (ఏ డి ఇన్ఫినిటమ్)”. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ విడుదల చేశారు. సంతోషంగా ఉన్న కుటుంబంలో బాలిక మిస్సింగ్ ఆందోళన కలిగిస్తుంది. ఆ బాలికని ఎవరు కిడ్నాప్ చేశారు. ఎలా మిస్ అయింది అనే విషయాలపై టీజర్ ద్వారా సస్పెన్స్‌ని కలిగిచారు. ఎంతో హృద్యంగా సాగిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రానికి యుగంధర్ దర్శకత్వం వహించగా, విజయ్ కూరాకు సంగీతం అందిస్తున్నాడు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. తాజాగా విడుదలైన టీజర్ ను మీరు కూడా వీక్షించండి.