ప్రపంచ పటంలో నూతన దేశం ఆవిర్భవించనుంది. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని పపువా న్యుగినియాకు చెందిన బుగెన్‌విల్ అనే చిన్న దీవి త్వరలోనే స్వతంత్ర దేశంగా ఆవిర్భనుంచనుంది. ఈ మేరకు జరిగిన రెఫరెండంలో స్వతంత్రదేశానికే మొగ్గు చూపారు. ఈ ద్వీపంలో మూడు లక్షలమంది ప్రజలు ఉంటారు. వీరిలో ఎక్కువమంది మెలనేసియా తెగకు చెందినవారు. స్థానిక భాష టొక్‌పిసిన్.
ఈ దీవిలో రాగి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీటి వెలికితీతకు అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమకు స్వాతంత్ర్యం కావాలన్న డిమాండ్‌తో బుగెన్‌విల్ ప్రజలు పపువా న్యుగినియా సైన్యంతో చేసిన పోరులో 20 వేలమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తదేశం అవతరించనుండటంతో ఆదాయమార్గాలపై దేశ నాయకులు అన్వేషిస్తున్నారు. గనుల తవ్వకాలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందిస్తే ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బుగెన్‌విల్ నేతలు భావిస్తున్నారు.