నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన రంగ్‌దే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను మార్చి 26న వేసవి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. అయితే ఇంతలో నితిన్ తన తరువాతి సినిమా చెక్ మొదలు పెట్టేశాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ మంచి స్పందనను అందుకుంది. ఇటీవల న్యూఇయర్ కానుకగా చెక్ టీం మరో పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే తాజాగా చెక్ మూవీ గ్లిప్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో నితిన్ ఆదిత్య అనే పాత్రలో.. జైలులో తీవ్రవాది, దేశ ద్రోహి అనే గుర్తింపుతో వెళ్లి ఉరి శిక్ష పడ్డ ఖైదీ పాత్రలో కనిపిస్తాడు. తను జైలులో చెస్ ఎలా నేర్చుకున్నాడు… విశ్వనాథ్ ఆనంద్, కాస్పరోవ్ వంటి ఆటగాళ్ల స్థాయికి ఎలా ఎదిగాడు అనే అంశాన్ని ఫస్ట్ గ్లింప్స్‌లో చూపించారు. అసలు నితిన్ ఎందుకు జైలుకు వెళ్లాడు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే…
previous post
next post
రామ్ గోపాల్ వర్మపై నూతన దర్శకుడు ఫైర్