telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మున్సిపల్‌ ఎన్నికలు : సీఎం సొంత నియోజకవర్గంపైనే నిమ్మగడ్డ కన్ను !

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌ ఎలక్షన్స్‌ షెడ్యూల్‌ ఇటీవలే రిలీజ్‌ చేసింది. మార్చి 10న ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ఱయం తీసుకున్నారు. వివిధ మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లోని సింగిల్ నామినేషన్లపై ఎస్ఈసీ నిమ్మగడ్డ నజర్ పెట్టారు. గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని ఆరు మున్సిపాల్టీల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంపై కలెక్టర్ల నుంచి నివేదిక కోరారు ఎస్ఈసీ. ఈ నెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. సీఎం సొంత నియోజకవర్దం పులివెందుల సహా రాయచోటి, మాచర్ల, పుంగనూరు, పలమనేరు, తిరుపతి కార్పోరేషన్లల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలు అయ్యాయి. పులివెందుల, రాటచోటిల్లో 21 వార్డుల్లో, పుంగనూరులో 16, పలమనేరు, మాచర్లల్లో చెరో పది వార్డుల్లో సింగిల్ నామినేషన్ల దాఖలు అయ్యాయి. తిరుపతి కార్పోరేషన్లోని 6 డివిజన్లల్లో సింగిల్ నామినేషన్ దాఖలు అయ్యాయి. దీంతో కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాక సింగిల్‌ నామినేషన్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.

Related posts