telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

స్థిరంగా బంగారం… ఎగిసిపడ్డ వెండి ధరలు

బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 50,620 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 46,400 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,290 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,250 పలుకుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి ధరలు మాత్రం షాకిచ్చాయి. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 400 పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 75, 000 వద్ద ఉన్నది.

Related posts