telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ పూర్తి…

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు. ప్రస్తుతం చెర్రీ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్దె చరణ్‌కు జోడీగా నటిస్తున్నారు. మెగా అభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ దాదాపు నలభై నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తియింది. అయితే ఈ సినిమాలో చరణ్ పేరు సిద్ధ. ఈ సిద్ధ ఓ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చరణ్ పాత్ర పరిచయం అందరిచేత కన్నీరు పెట్టించే విధంగా డిజైన్ చేసినట్లు కూడా చెప్పారు. అయితే ఈ సినిమాలో చరణ్ పాత్రపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా మే13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఏంటని తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Related posts