శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ హీరోయిన్లు సంజన గల్రాని, రాగిణి ద్వివేది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఈ నెల 23 వరకు వీరి కస్టడీని కోర్టు పొడిగించింది. అయితే తాజాగా సంజన గల్రానీ తనకు బెయిలు ఇప్పించాలంటూ మరోమారు కోర్టును ఆశ్రయించింది. ఆమె పెట్టుకున్న బెయిలు పిటిషన్లను కోర్టు ఇప్పటికే రెండుసార్లు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సీసీబీ, నార్కోటిక్ విభాగం అధికారులు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటికీ ఆమె పేరును ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించలేదని పిటిషన్‌లో పేర్కొన్న సంజన తరపు న్యాయవాదులు సీసీబీ, కాటన్‌పేట పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు.
previous post