telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ట్విట్టర్ వేదికగా యురేనియం రచ్చ .. చేతనైతే అనుమతులు రద్దు చేసిన ట్వీట్ పెట్టండి చూద్దాం..

KTR_Revanth

కాంగ్రెస్‌ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నల్లమల యురేనియం తవ్వకాల వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై తీవ్రంగా స్పందించారు. ”కేటీఆర్‌ గారూ.. సురభి నాటకాలు కట్టిపెట్టి యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయండి” అని పేర్కొన్నారు.

యురేనియం తవ్వకాల అంశంలో ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని.. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన కాసేపటికే రేవంత్‌ కూడా ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ అనుమతులు రద్దు చేయాలని కోరారు.

Related posts