telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతికి గిఫ్ట్‌ ఇచ్చిన నితిన్‌

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ’ సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయనప్పటికీ పండుగ సంర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో నితిన్, హీరోయిన్ కీర్తీ ఇద్దరూ కూడా భారతీయ సంప్రదాయాన్ని కల్లకు కట్టినట్లు చూపుతున్నారు. సంక్రాంతి పండుగ సందడి మొత్తం వారిలోనే కనిపిస్తోంది. భీష్మా వంటి బ్లాక్ బస్టర్ తరువాత నితిన్ తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వేసవి బహుమతిగా మార్చి 26న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నితిన్ అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

Related posts