కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ జూపార్క్ లో 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అనుమానం కలిగిన 8 సింహాల సంపుల్స్ ను సీసీఎంబి పరీక్షల నిమ్మితం జూపార్క్ అధికారులు పంపారు. వాటి రిపోర్ట్స్ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానం? వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులను మూసివేశారు. ఆదివారం నుండి జూ పార్క్ లో సందర్శకులకు అనుమతి నిరాకరించారు జూ అధికారులు.
previous post