ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం “రాజుగారిగది” చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు ఫ్రాంచైజీగా “రాజుగారి గది-3” తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతుంది. “రాజుగారిగది-3″లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, ఊర్వశి, అజయ్‌ఘోష్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే తాజా షెడ్యూల్‌లో తమన్నా పాల్గొనాల్సి ఉందట. కానీ ఓంకార్ ముందు చెప్పిన కథకు, ప్రస్తుతం ఉన్న స్క్రిప్ట్‌కు చాలా తేడా ఉండటంతో తమన్నా సినిమా నుండి డ్రాప్ అయ్యిందని వార్తలు విన్పిస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సిందే.
previous post