telugu navyamedia
సినిమా వార్తలు

యూట్యూబ్‌ను షేక్ చేసిన‌“భీమ్లా నాయక్” .!

చిత్ర‌ప‌శ్ర‌మ‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న న‌ట‌న‌తో, మంచితనంతో అభిమానులను ఆక‌ట్టుకున్నాడు. ప‌వ‌న్ సినిమాలు అభిమానుల‌కు పిచ్చి, ఆయ‌న థియాట‌ర్‌లో డైలాగ్ చెబితే ఫ్యాన్స్‌‌‌‌కు పూనకాలు రావాల్సిందే. ఇక ఆయన ప్రసంగిస్తే ప్రభంజనంమే..టాలీవుడ్‌లో ఆయకున్న క్రేజ్‌ అలాంటిది. చేసిన‌వి కొన్ని సినిమాలైన ప్ర‌జ‌ల‌లో కొండంత క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.Pawan Kalyan As Bheemla Nayak: భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ లుక్స్  అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్..

దాదాపు పవన్‌ మూడేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి వకీల్ సాబ్‌‌ సినిమా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సస్‌న సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం పవర్ స్టార్ న‌టిస్తున్న సినిమాల్లో “భీమ్లా నాయక్” ఒక‌టి. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించనుంది. అయితే “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆగ‌స్టు 15 పుర‌స్క‌రించుకొని “పవర్ స్టార్మ్” పేరుతో మూవీ మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి.

దేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన టీజర్ గా “భీమ్లా నాయక్” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. నిన్న విడుదలైన ‘పవర్ స్టార్మ్’ అంచనాలను మరింతగా పెంచింది. ఇప్పటికి ఈ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఆల్ రికార్డులు బ్రేక్ చేసి నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

Pawan Kalyan Bhimla Nayak Movie Stills Viral Ayyappanum Koshiyum Telugu  Trivikram Rana Daggubati Tollywood - Kaly-TeluguStop

మలయాళంలో సూప‌ర్ హిట్ అందుకున్న‌ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. “వరల్డ్ ఫేమస్ లవర్”లో చివరిసారిగా నటించిన ఐశ్వర్య రాజేష్ రానా సరసన జతకట్టనుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి రానాకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts