telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్..! కేటీఆర్‌ ట్వీట్‌

ఆ రోజుల్లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు హైదరాబాద్‌ మహానగరంలో తిరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఆ డబుల్‌ డెక్కర్‌ బస్సులు కనిపించకుండా పోయాయి. నిజాం కాలంలో ఈ బస్సులు హైదరాబాద్‌ లో ఎక్కువగా చూసేవాళ్లం. ఆ బస్సులు నిజాం రాజ్యం అంతమయ్యాక కనుమరుగయ్యాయి. తాజాగా…షాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి డబుల్‌ డెక్కర్‌ బస్సులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌, రాణిగంజ్‌ మీదుగా సికింద్రాబాద్‌ వరకు ఈ బస్సులు తిరిగేవని…ఇప్పుడు మళ్లీ అలాంటి డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకురావాలని కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించారు మంత్రి కేటీఆర్‌. తాను అబిడ్స్‌లోని సెయింట్‌ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళుతున్నప్పుడు డబుల్‌ డెక్కర్‌ బస్సులు కనిపించేవని, వాటి జ్ఞాప‌కాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అయితే…బస్సులను ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని…మళ్లీ హైదరాబాద్‌ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అడిగారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌ అయింది.

Related posts