2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. ఇటు చిత్ర పరిశ్రమపై కరోనా ప్రభావం చూపిస్తుంటే.. మరోవైపు ప్రముఖ నటులు పరిశ్రమకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ మన్సూర్ అలీఖాన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్ అలీఖాన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.
previous post
next post
ఆడవాళ్లను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ..