telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ఆదేశాలు…

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసోమేశ్ కుమార్…. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ ప్రైస్, డెవలప్ మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకురావడానికి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, సాయిల్ టెస్టింగ్, కూరగాయల సాగు, పశుసంవర్ధకం న్యూట్రేషన్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంశానికి  సంబంధించి అధికారులతో స్మాల్ గ్రూప్స్ ఏర్పాటు చేసి వివరాలతో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐటి వినియోగం ద్వారా ఎస్హెచ్జి గ్రూపులకు నిరంతర సేవలందించాలని, ప్రతి గ్రూప్ కు బ్యాంక్ లింకేజ్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో చిన్నారులలో మాల్ న్యూట్రీషన్, మహిళలలో అనీమియా తగ్గించడానికి ఎస్హెచ్జిలు, సంబంధిత లైన్ డిపార్టుమెంట్స్ కన్వర్జెన్సీ తో కృషి చేయాలని అధికారులను కోరారు.

Related posts