బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో స్థిరంగా ఉంటె ఢిల్లీలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. కానీ హైదరాబాద్ లో బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 10 పెరిగి రూ. 48,070 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 44,070 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,700 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,900 పలుకుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి ధరలు కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.. 69,700 వద్ద కొనసాగుతోంది.
next post
కశ్మీర్ ప్రజల సంబంధాలను భారత్ తెంచివేసింది: పాకిస్తాన్