telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పిన రజినీ…

Rajinikanth

ఈ మధ్యే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పిన సూపర్‌ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రావడం లేదు అని ప్రకటించాడు. ఈ నెల 31వ తేదీన పార్టీని ప్రకటించడానికి సిద్ధమైన రజినీ తాజాగా అనారోగ్యంబారినపడ్డారు. అయితే అన్ని టెస్టులు చేసి రజనీని ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకూడదు అని సూచించారు. కానీ చెన్నైకి వెళ్లిపోయిన రజనీకాంత్‌ పై అనేక రకాలుగా ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తోంది… ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు రజనీకాంత్.. తన ప్రకటనలో రాజకీయాలకు నో చెప్పిన రజనీ… ఈ నెల 31 న పార్టీ ప్రకటన లేదని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచిన వ్యక్తులను బలిపశువుగా భావించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు రజనీకాంత్.. తన ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి జరిగిన పరిణామాలు దేవుని హెచ్చరికగా తీసుకుంటానని, 2021 తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ పతనానికి తన ప్రణాళికలతో ముందుకు సాగలేనని తెలిపారు.. అధిక రక్తపోటుతో బాధపడుతూ చికిత్స పొంది.. హైదరాబాద్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెండు రోజుల తర్వాత రజనీకాంత్ చేసిన ప్రధాన ప్రకటన ఇది.. 70 సంవత్సరాల వయసున్న రజనీకాంత్ కిడ్నీ సంబంధిత సమస్యలు, లేబుల్ హైపర్‌టెన్షన్ మరియు వయస్సు పైబడడం.. దృష్టిలో ఉంచుకుని ఒత్తిడిని నివారించడానికి ఒక వారం పాటు పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉండాలని సూచించారు వైద్యులు.

Related posts