telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కన్నీటి వాన…

నిద్రిత ధాత్రిలో
తెలవారని కాళరాత్రిలో
సంద్రపు కెరటాల ఢంకాద్వనంలో
అగ్నిపర్వతమొకటి ఉబికి
గొంతు విప్పలేని మౌనాల సంఘర్షనతో
వెల్లువై “కన్నీళ్ల వాన”ని కురిపిస్తోంది
కారడవుల్లో ఎర్ర కలువనై పోతానంటోంది
ఏ విప్లవ చైతన్యం ఆవరించిందో
అంతకంటే ముందు
ఏ మృగాల రాక్షసరతికి బలై పోయిందో
చావు బతుకుల సంధ్యాకాలంలో
ఏరులై పారే ఏ బడుగు జీవుల రక్తాన్ని చూసిందో
సుత్తి సమ్మెట పట్టిన ఏ కూలీల కడుపు చిచ్చులని,
కాలే పేగుల శ్రమ దోపిడీని చూసిందో
పాపం పుణ్యం తలుస్తూ
సత్తువలేని రక్తాలతో
కలుగులో ఎలుకల్లా బతుకుతూ
స్వార్థాల చేతులకి రాకాసిమూకలకి బలవుతున్న సమాజాన్ని ఉద్దరించాలంటూ
బుసలు కొట్టే పాములను బుట్టలోకి పట్టాలంటూ
బ్రతుకులను సమాధి చేసే శ్మశాన ద్వారాలను మూసి
సమాజమనే దేవాలయానికి స్వర్గ తోరణాలని కట్టాలని ప్రచండమై,ఝంఝా ప్రభంజనమై
విరుతించి కానలవైపు సాగుతోంది
రగిలిన హృదయమొకటి…

Related posts