telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కశ్మీర్‌లో కేంద్రపాలన … తాత్కాలిమే .. : మోడీ

modi on jammu and kashmir rule

ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలిమేనని మరోసారి స్పష్టం చేశారు. అక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాక కేంద్ర పాలన ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎందరో మహానీయులు స్వప్నం సాకారమైందన్నారు. కశ్మీర్‌ విభజన తరువాత ప్రధాని తొలిసారిగా గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమైందని పేర్కొన్నమోదీ కశ్మీర్‌, లదాఖ్‌ ప్రజలకు ఈసందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు.

ఇంతకాలం ఆర్టికల్‌ 370 వల్ల కశ్మీర్‌, లదాఖ్‌ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు ఒకటే భారత్‌- ఒకటే రాజ్యంగం అనే కల నెరవేరిందన్నారు. ఆర్టికల్‌ 370 జమ్మూ కశ్మీర్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. ఈ ఆర్టికల్‌ను అడ్డం పెట్టుకుని జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అన్యాయం వెనుక పాక్‌ హస్తం ఉందని విమర్శించారు. ఇకపై కశ్మీర్‌ అభివృద్ది పథంలో ప్రయాణిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు కశ్మీర్‌ పునర్‌ నిర్మాణంలో యువకుల పాత్రపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

Related posts